Skip to main content
Bronchitis : prevention and care
Bronchitis అంటె ఏంటీ ఆ సమస్య ఎలా వస్తుంది? దానికి సంబంధించిన చికిత్స ఉందా?
మనిషికి ప్రాణవాయువు అందడం అవసరం..ప్రతీ కణానికి ప్రాణవాయువు అందాలి..అలాగే శరీరంలో ఉత్పత్తి అయ్యే కార్బన్ డై ఆక్సైడ్ బయటికి విడుదల అవ్వాలి..ఈ రెండు సక్రమంగా పనిచెయ్యాలి.
@సాదారణంగా జలుబు చేసినప్పుడు చీముడు ముద్దగా మారి శ్వాస ఆడదు..ఇదే తరహా ఇబ్బంది శ్వాస నాళాలలో ఏర్పడితే బ్రోన్కకైటిస్ అంటారు.వైరస్ లు బాక్టీరియా కారణంగా గాలిగొట్టాలకు ఇన్ఫెక్షన్ వస్తుంది.దీనితో శ్వాస నాళాలు ఉబ్బి పోయి ముసుకుపోతుంది.
ఇది ఊపిరితిత్తులు వరకు చేరిపోయి..గాలిని చేరనివ్వదు దీనితో బ్రాంకైటీస్ ప్రాణాంతకమవుతుంది.వర్షకాలం తో పాటు శీతాకాలం లో కూడా దీని బారినపడే సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
#బ్రాంకైటీస్ లక్షణాలు:రెండు మూడు రోజులు గడిచే సరికి దగ్గు, తేమడ వస్తుంది.పసుపు లేదా ఆకుపచ్చ కెల్ల పడుతూ ఉంటుంది.దగ్గుతో పాటు కొందరికి వాంతులు కూడా అవుతాయి..ఛాతికి వెనుక బాగంలో నొప్పిగా ఉంటుంది. దీనితో పాటు గొంతుబొంగురు... పోవడం, కళ్ళు ఉబ్బిపోవడం,ముక్కు కారడం వంటివి లక్షణాలు..
ఇన్ఫెక్షన్ వల్ల శ్వాస నాళాలు ముసుకుపోతాయి.గాలి ఆడటం కష్టంగా ఉంటుంది.దీనితో నిద్రపోతున్నపుడు, లేదా కూర్చొని ఉన్నపుడు పిల్లి కూతలు వస్తాయి..
#బ్రాంకైటీస్ జాగ్రత్తలు : బ్రాంకైటీస్ అనేది శీతాకాలంలో ఎక్కువగా వస్తుంది.రోగ నిరోదక శక్తి వలన లేదా కొద్దీ పాటి ఆంటి బయోటిక్స్ వాడడం వల్లనో తగ్గించు కోవచ్చు.అలర్జీ ఉన్నవాళ్లు వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గినప్పడు జగర్తగా ఉండాలి. పెంపుడు జంతువులు ఉన్నవాళ్ళు జాగర్తలు పాటించాలి.ఉబ్బసం,నిమ్ము,శ్వాస సంభందించిన అలర్జీలు ఉన్నా వారు చలిలో బయటకి తిరగరాదు ఊపిరి ఆడక ఇబ్బంది పడితే ..వేడి నీటిని ఆవిరి పట్టాలి వేడి నీటిని ఆవిరి పట్టడాన్ వలన ఉపశమనం ఉంటుంది.
@ పొగత్రాగడం పూర్తిగా మానేయాలి ..ఆహారంలో అల్లంవెల్లులి,మిరియాలు ఎక్కువగా ఉండేలా చేసుకోవాలి.వర్షాకాలంలో,శీతాకాలంలో వేడినీటిని తాగుతూ ఉండాలి ..కూల్డ్రింక్స్,ఐస్ క్రీమ్స్ వాటిని పూర్తిగా మానేయాలి.
#మనిషి నిమషానికి 16నుంచి 28 సార్లు గాలిని పీల్చు కుంటాడు. ఈ సంఖ్య అటుఇటుగా ఉన్నా పర్వాలేదు కానీ నిమిషానికి 12కంటే తక్కువగా పీల్చుకున్నా...20 సార్లు పీల్చుకునే అవసరం వచ్చినా అది అనారోగ్యమే....
Comments
Post a Comment