High Bp- Dietary principles

 హై -బీపీ కి ఎమ్ తినాలి? ఎమ్ తినకూడదు?



హై -బిపి ఉన్న వాళ్ళు రోజు మందులు వేసుకుంటూ తినే ఆహారంలో ఉప్పును తగ్గిస్తారు.అయినా సరే బిపి అదుపులో ఉంటా లేదు వాపోతుంటారు.నిజానికి రక్తపోటు అదుపులో ఉండడానికి మందులు ఒక్కటె సరిపోవు..అలెనే ఉప్పును తగ్గించాన్నంత మాత్రాన బీపీ అదుపులోకి రాదు.ఒక వైపు మందులు వాడుతూనే మన ఆహారపు అలవాట్లులో మార్పులు చెయ్యాలి.

@ముఖ్యంగా సోడియం ఉన్న ఆహారాలను దూరముగా ఉండాలి..పొటాషియం ఉన్న ఆహారాలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.పొటాషియం ఎక్కువగా కూరగాయలలో దొరుకుతుంది.ప్రత్యేకంగా చెప్పాలి అంటే *పుచ్చకాయ,ద్రాక్ష,కమలాలు, దానిమ్మ,స్వీట్ పొటాటో( చిలకడ దుంప)ఆకుకురాలలో పొటాషియం అధికంగా దొరుకుతుంది.అందుకని పొటాషియం ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది.

#హై-బీపీ ఉన్నవాళ్లు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం చాలా ఉంది.ఫ్యాట్ ఉన్న పదార్థాలు వాడకూడదు.అంటే నెయ్యి, వెన్న,డాల్డా,పామాయిల్ వీటి అన్నింటిలో  స్టాట్రేట్ ఫేట్స్ ఉంటుంది.అందుకని స్టాట్రేట్ ఫేట్స వాడకూడదు.బీపీ ఉన్నవాళ్లు 5 to 6 గ్రాముల లోపు ఉప్పును తీసుకుంటె పర్వాలేదు బీపీని కంట్రోల్ లో పెట్టుకోవచ్చు.

రక్తపోటు స్థాయిని బట్టి దానికి తగ్గ మందులు తీసుకుంటూ..తగిన ఆహారం తీసుకోవాడం ధ్వారా బీపీని అదుపులో ఉంచుకోవచ్చు.



1)పొటాషియం లభించే అరటిపండు, ద్రాక్ష,బొప్పాయి, మామిడి,కమలా, స్టోబేరి,కాకరకాయ, మునక్కడా వంటివి ఆహారంలో తరుచుగా తీసుకుంటూ ఉండాలి.అరిటీ పండు ,జామా,పుచ్చకాయ, నేరేడు వంటి వాటికి బిపిని అదుపులో ఉంచే శక్తిని కలిగి ఉన్నాయి అని పరిశోదనలు చెబుతున్నాయి.

2)రక్తపోటును అదుపులో ఉంచడానికి వెల్లులి చాలా సహాయపడుతుంది.రోజు వారీ వంటల్లో వెల్లులిని ఆహారంలో తీసుకోవాలి. వంతలకి నువ్వాల నూనె,ఆలివ్ ఆయిల్ వంటివి వాడుతూ ఉండాలి ఉదయం లేవగానే బీట్రూట్ రసాన్ని త్రాగుతూ ఉండాలి.

3)అలానే టమాటాలో లోకిపిన్ అనే రసాయనానికి బిపిని తగ్గించే గుణం ఉంది.ఆహారంలో టమోటా తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.గ్రీన్ టీ ని కూడా తీసుకొంటూ ఉండడం వలన కూడా బిపిని అదుపులో వుంచుకోవచ్చు.

4)మాంసాహారం పూర్తిగా మానేయాలి..బేకరీ ఫుడ్స్, రెడీమేడ్ ఆహారులు సోడియం పాళ్లు ఎక్కువగా వుంటాయి.ఉప్పు శాతం అధికంగా ఉండే కోడిగుడ్లు,రెడమీట్ ఉండే మాంసాహారం పూర్తిగా మానేయాలి.సముద్రచేపలను,ఉప్పు చేపలను ,కాఫీ కెఫిన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది బీపీని పెంచుతుంది. కాబట్టి కాఫీని తక్కుగా తీసుకోవాలి..ఆహారంలో నూనె పరిమానాన్ని పూర్తిగా తగ్గించాలి.. ముఖ్యంగా హైడ్రోజనేట్ నూనెలను పూర్తిగా మానుకోవాలి.నిత్యం వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి.


Comments