Skip to main content
How to improve your circulation/ రక్తప్రసరణ మెరుగు పరుచుకోవడానికి మార్గాలు
రక్తప్రసరణ మెరుగు పరుచుకోవడానికి మార్గాలు!
మన శరీరంలో రక్తనాళాలు పొడవు 60మైళ్ళు ఇది మన శరీరంలో రక్తాన్ని మూల ములలకి చేరవేస్తుంది.రక్తప్రసరణ సరిగ్గా లేకపోయినా ఆయా శరీర భాగాలకు ఆక్సిజన్,పోషకాలు అందవు...దాంతో ఆరోగ్య సమస్యలు వస్తాయి.రక్తప్రసరణ బాగుండాలి అంటె ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి,రక్తప్రసరణ ఎలా మెరుగు పరుచుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం!
#రక్త ప్రసరణ తగ్గుతూ ఉంటే మన శరీరంలో కొన్ని లక్షణాలు కనపడతాయి.. చేతులు,కాళ్లు చల్ల పడతాయి..చర్మం పొడి బారడం, చేతులు యొక్క గోళ్లు పేలుసుగా మారడం,జుట్టు ఊడిపోవడం వంటి లక్షణాలు కనపడతాయి.అలాగే మధుమేహం ఉన్నవాళ్లు రక్తప్రసరణ తక్కువ గా ఉంటే గాయాలు త్వరగా మానవు....సిగరెట్ అలవాటు ఉన్నవాళ్ళు గుండె నుండి శరీరానికి రక్తాన్ని చెరవేసే రక్తనాళాలుకు,ధమన్లకు హానికలుగుతుంది.
దీనితో రక్తప్రసరణ తగ్గుతుంది. వెంటనే ఆ అలవాటును మానుకోవాలి ..రక్తపోటు ఉన్నవాళ్లు తరుచు డాక్టరుని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.రక్తప్రసరణ తక్కైవగా ఉంటే ముఖ్యంగా చేతులు,కాళ్ళు చల్ల పడిపోవడం జరుగుతుంది.అలెనే శరీరం నిలం రంగులోకి మారిపోతుంది .
రక్తప్రసరణ బాగా ఉండాలి అంటే ముఖ్యంగా స్మోకింగ్ అనేది చెయ్యకూడదు..స్మోకింగ్ నికోటిన్ అనే పదార్థం అది రక్తనాళాలు మీద ప్రభావము చూపించి హార్డ్ నెస్ పెంచి రక్తప్రసరణ కు హాని కలిగిస్తుంది.ఫ్రీగా రక్తప్రసరణ జరగపోవడం వలన శరీర భాగాలకు,ప్రతికణంలో మార్పులు రావడం జరుగుతుంది.అందువలన స్మోకింగ్ అలవాటు ఉన్నవాళ్లు స్మోకింగ్ అలవాటును మానుకోవాలి.
రక్తప్రసరణ మెరుగు పరుచుకోవడానికి మార్గాలు....!
1.మన శరీరంలో రక్తప్రసరణ బాగా జరగాలి అంటే అందుకు సరిపడా మంచినీటిని త్రాగాలి..అలానే వ్యాయామం చేసినా తరువాత తగినన్ని మంచి నీటిని త్రాగాలి.
*ఎక్కువగా కూర్చొని పని చేసే ఉద్యోగులుకు నడుము నొప్పే కాకుండా,రక్తప్రసరణ సమష్యాలు కూడా వస్తాయి. అలెనే కూర్చొని ఉండి పోవడంవలన కాలు కండరాలు బలహీనమై,రక్తప్రసరణ తగ్గుతుంది.రక్తం గడ్డ కట్టే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు.
2.యోగాతో రక్తప్రసరణ బాగా జరుగుతుంది.యోగ చెయ్యడం వలన శరీరంలో ఏర్పడే కదలికల వల్ల రక్తం చక్కగా ప్రయాణిస్తూ.. ప్రతీ కణానికి ఆక్సిజన్ చేరుతుంది.అలెనే ఈత కొట్టడం ద్వారా శరీరం ఆక్సీజన్ ఎక్కువగా గ్రహిస్తుంది.గుండె పనితీరు మెరుగు పడుతుంది.రక్తపోటు క్రమబద్ధీకరణగా ఉంటుంది.
3.పండ్లు ,కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ ..కోలాస్ట్రల్ తక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి.పొడి చర్మం పైన ఒత్తిడిని కలిగిస్తూ శరీరం అంతా మర్దనా చెయ్యడం వలన రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
Comments
Post a Comment